ఉపాసన వల్లే నేను అలాంటి సినిమాలు చూస్తున్నా: రామ్ చరణ్

  • బయోపిక్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం
  • 'సంజు'లో రణబీర్ కపూర్ చాలా బాగా చేశాడు
  • ఉపాసనకు కామెడీ సినిమాలంటే ఇష్టం
తనకు బయోపిక్ సినిమాలంటే చాలా ఇష్టమని టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తెలిపాడు. బయోపిక్ లలో నిజాలు ఉంటాయని... అందుకే అవి తనకు నచ్చుతాయని చెప్పాడు. అయితే, బయోపిక్ లో నటించే అవకాశం తనకు వస్తే... ఎంతవరకు న్యాయం చేయగలుగుతానో మాత్రం చెప్పలేనని అన్నాడు. 'సంజు' సినిమాలో రణబీర్ కపూర్ నటన చాలా బాగా నచ్చిందని.. ఆయన గొప్ప యాక్టర్ అని కితాబిచ్చాడు. ఓ ఆంగ్ర పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ ఈ మేరకు స్పందించాడు.

తన భార్య ఉపాసనకు కామెడీ సినిమాలంటే చాలా ఇష్టమని... ఆమె వల్లే తాను కామెడీ సినిమాలు చూస్తున్నానని... ఈ విషయంలో ఆమెకు ధన్యవాదాలు చెప్పాలని చరణ్ తెలిపాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ నటిస్తున్నాడు. ఆయనకు జోడీగా కైరా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్ మూవీలో నటించనున్నాడు. 
Go Back to Shorts
ram charan
upasana
tollywood

More Telugu News